Steve Smith: బాలయ్య, అల్లు అర్జున్ డైలాగులు చెప్పిన స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్.. వీడియో ఇదిగో

Balakrishna and Allu Arjun dialogues from Steve Smitth
  • డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో ఆడుతున్న స్టీవ్ స్మిత్
  • ఖాళీ సమయంలో స్టార్ స్పోర్ట్స్ - 1తో ముచ్చట
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
ప్రస్తుత క్రికెట్ లో అత్యంత ఫాలోయింగ్ ఉన్న స్టార్లలో ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ ఒకడు. లండన్ లోని ఓవల్ మైదానంలో జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ప్రస్తుతం స్టీవ్ ఆడుతున్నాడు. ఖాళీ సమయంలో స్టార్ స్పోర్ట్స్ తో ముచ్చటించాడు. బాలయ్య, అల్లు అర్జున్ డైలాగులు చెప్పి అలరించాడు. దీనికి సంబంధించిన వీడియోను స్టార్ స్పోర్ట్స్ - 1 ట్విట్టర్ లో షేర్ చేసింది. "అపాయింట్ లేకుండా వస్తే వెకేషన్ చూడను, లొకేషన్ చూడను", "డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. ఇఫ్ యు ట్రబుల్ ది ట్రబుల్... ట్రబుల్ ట్రబుల్స్ యూ... ఐయామ్ నాట్ ది ట్రబుల్. ఐయామ్ ట్రూత్", "తగ్గేదే లే" అంటూ డైలాగులు చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Steve Smith
Australia
Balakrishna
Allu Arjun
Dialogues

More Telugu News