Indian Railways: రైలు పట్టాలపై వ్యక్తి ఆత్మహత్యాయత్నం... పరుగున వెళ్లి కాపాడిన మహిళా కానిస్టేబుల్

RPF lady constables heroic act saves mans life

  • బెంగాల్ లోని పూర్వ మెదినిపుర్ రైల్వే స్టేషన్ లో ఘటన
  • రైలు రావడాన్ని గమనించి పట్టాలపై ఆత్మహత్య చేసుకోవడానికి బోర్లా పడుకున్న వ్యక్తి
  • గమనించిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సుమతి
  • రైలు రాకకు క్షణాల ముందు అతన్ని పట్టాలపై నుండి లాగి ప్రాణాలు నిలిపిన వైనం

రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించిన ఓ వ్యక్తిని చివరి క్షణాల్లో కాపాడింది ఓ ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్ లోని పూర్వ మెదినిపుర్ రైల్వే స్టేషన్ లో జరిగింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వైరల్ గా మారింది. గుర్తు తెలియని ఓ వ్యక్తి ఈ రైల్వే స్టేషన్ కు చేరుకొని, ఓ రైలు రావడాన్ని గమనించి వెంటనే పట్టాల పైకి చేరుకొని, పట్టాలపై రైలు వచ్చే మార్గంలో పడుకున్నట్లుగా వీడియోలో ఉంది.

పక్క ప్లాట్ ఫాంపై విధులు నిర్వహిస్తున్న ఆర్బీఎఫ్ కానిస్టేబుల్ సుమతి దీనిని గమనించింది. వెంటనే కిందకు దిగి వచ్చి.. పట్టాలపై నుండి అతడిని వెనక్కి లాగారు. రైలు అక్కడకు చేరుకునే కొన్ని క్షణాల ముందే ఇది జరిగింది. మరో ఇద్దరి సాయంతో ఆమె అతనిని ప్లాట్ ఫాం పైకి తీసుకు వచ్చింది. సమయస్ఫూర్తితో సాహసించి వ్యక్తిని కాపాడిన సుమతిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్పీఐ ఇండియా ట్వీట్ చేసింది.

Indian Railways
train
rpf
  • Loading...

More Telugu News