Mothukuri Venkatesh: వైసీపీకి షాక్.. రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి రాజీనామా

YSRCP state youth leader Mothukuri Venkatesh resigns

  • తుని నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్న మోతుకూరి వెంకటేశ్
  • వెంకటేశ్ ను పక్కన పెట్టేసిన మంత్రి దాడిశెట్టి
  • పార్టీకి, పదవికి రాజీనామా చేసిన వెంకటేశ్

తుని నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మోతుకూరి వెంకటేశ్ తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీని స్థాపించినప్పటి నుంచి వెంకటేశ్ పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. మంత్రి దాడిశెట్టి రాజాకు అన్నీ తానై వ్యవహరిస్తూ ఆయన విజయంలో కీలక పాత్రను పోషించారు. అయితే రాజా మంత్రి అయ్యాక వెంకటేశ్ ను పక్కన పెట్టారు. ఈ క్రమంలో తీవ్ర అసంతృప్తికి గురైన వెంకటేశ్ కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. తాజాగా వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారనే విషయంలో క్లారిటీ లేదు.

Mothukuri Venkatesh
YSRCP
  • Loading...

More Telugu News