Virat Kohli: ఫ్యాన్స్ ట్రోలింగ్ పై విరాట్ కోహ్లీ స్పందన
- త్వరగా అవుటయ్యి, ఆహారం ఆరంగించడంపై అభిమానుల్లో ఆగ్రహం
- సామాజిక మాధ్యమాల్లో విమర్శల ట్రోలింగ్
- నర్మగర్భంగా స్పందించిన విరాట్ కోహ్లీ
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ వేగంగా అవుట్ కావడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆస్ట్రేలియాలో తొలి ఇన్సింగ్స్ లో 469 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో భారత బ్యాట్స్ మెన్ క్రీజులో బ్యాట్ ఝుళిపించాలని అభిమానులు కోరుకోవడం సహజం. కానీ రోహిత్ శర్మ 15, శుభ్ మన్ గిల్ 13, చటేశ్వర్ పుజారా 14, విరాట్ కోహ్లీ 14 ఇలా ఒక్కొక్కరుగా పెవిలియన్ చేరారు. ఓపెనర్లతోపాటు పూజారా కూడా అవుట్ కావడంతో కోహ్లీ అయినా ఆదుకుంటాడన్నది అభిమానుల అంచనా. కానీ, కోహ్లీ కూడా వారి బాటలోనే త్వరగా అవుట్ కావడంతో ట్రోల్స్ తో విరుచుకుపడ్డారు.
2003 ప్రపంచకప్ లో టెండుల్కర్ త్వరగా అవుటయ్యానన్న బాధతో మూడు రోజుల వరకు ఆహారం ముట్టలేదు. కానీ, కోహ్లీ మాత్రం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిఫ్ 2023లో అవుటైన వెంటనే తింటున్నాడు’’ అనే అర్థంతో ఓ ట్విట్టర్ యూజర్ విమర్శనాత్మక ట్వీట్ పెట్టాడు. ఫొటోలో కోహ్లీ తినడం కనిపిస్తోంది. ఈ విమర్శలు కోహ్లీ హృదయాన్ని తాకినట్టున్నాయి. అతడు ఇన్ స్టా గ్రామ్ లో నిగూఢార్థంతో పోస్ట్ పెట్టాడు. ‘‘ఇతరుల అభిప్రాయాల కారాగారం నుంచి నిన్ను నీవు విముక్తి పొందేందుకు అయిష్టమనే సామర్థ్యాన్ని నీవు తప్పకుండా అభివృద్ధి చేసుకోవాలి’’ అని అందులో కోహ్లీ పేర్కొన్నాడు.