Pooja Hegde: క్రేజీ కాంబినేషన్.. విజయ్ దేవరకొండ సరసన పూజ హెగ్డే!

Pooja Hegde to romance with Vijay in Parushuram movie

  • పరుశురాం చిత్రంలో హీరోయిన్ గా పూజ ఎంపికైనట్టు వార్తలు
  • ప్రస్తుతం మహేశ్ సరసన ‘గుంటూరు కారం‘లో నటిస్తున్న పూజ
  • మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తర్వాత టాలీవుడ్ లో వరుస ఫ్లాప్ లు

తెలుగులో కొన్నాళ్లపాటు అగ్రహీరోయిన్ గా వెలుగొందిన నటి పూజ హెగ్డే. తమిళ్ లో కూడా మంచి స్టార్ డమ్ తెచ్చుకొని సౌత్ లో బిజీగా మారిన టైమ్ లోనే ఆమె బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ వరుసగా సినిమాలు చేసింది. కొన్ని హిట్స్ తో మెప్పించిన తర్వాత ఫ్లాప్స్ చేరాయి. టాలీవుడ్ లో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ హిట్ తర్వాత పూజ హెగ్డే నటించిన ఆరు సినిమాలు నిరాశ పరిచాయి. అటు బాలీవుడ్ లోనూ ఆమెకు అదే పరిస్థితి ఎదురైంది. ‘సర్కస్‌’, ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’ చిత్రాలు ఫ్లాప్ అవ్వడంతో పూజ తిరిగి తెలుగుపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. 

వరుస ఫ్లాప్స్ ఖాతాలో పడినప్పటికీ టాలీవుడ్ లో ఆమెకు భారీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ, పరుశురాం కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రంలో పూజ హీరోయిన్ గా ఎంపికయిందని సమచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే తెలుగులో మరో ఆసక్తికరమైన జోడీ ప్రేక్షకులను అలరించనుంది. కాగా, పూజ హెగ్డే  ప్రసత్తం మహేశ్ బాబు సరసన ‘గుంటూరు కారం’ చిత్రంలో నటిస్తోంది.

More Telugu News