Accident: ప్రమాదం జరుగుతున్న సమయంలో వీడియో.. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో ఒళ్లు జలదరించే విజువల్స్.. వీడియో ఇదిగో

Visuals within Coramandal Express at the time of accident

  • వారం క్రితం ఒడిశాలో చోటు చేసుకున్న ట్రిపుల్ ట్రైన్ యాక్సిడెంట్
  • యాక్సిడెంట్ సమయంలో కెమెరాలో షూట్ అయిన విజువల్స్
  • ప్రయాణికుల హాహాకారాలతో ఎండ్ అయిన వీడియో

ఒడిశాలో గత వారం చోటు చేసుకున్న భయానక ట్రిపుల్ ట్రైన్ యాక్సిడెంట్ విషాదం నుంచి ఇంకా ఎవరూ తేరుకోలేకపోతున్నారు. కోరమాండల్ ఎక్స్ ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, ఒక గూడ్స్ రైలు ఢీకొన్న ఈ ప్రమాదంలో 278 మంది దుర్మరణం చెందగా, వెయ్యికి పైగా గాయపడ్డారు. మన దేశ చరిత్రలో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదాల్లో ఒకటిగా ఈ ప్రమాదం నిలిచిపోయింది. ప్రమాదానికి సంబంధించి పలు విజువల్స్ ను అందరూ చూశారు. వీటిలో బోగీలు ఒకదానిపై మరొకటి పడి ఉండటం, చెల్లాచెదురుగా పడి ఉన్న బోగీలు, వంగిపోయిన బోగీలు, మృతదేహాలు ఇలా చాలా దృశ్యాలను అందరూ వీక్షించారు. 

అయితే, తాజాగా వెలుగులోని వచ్చిన ఒక వీడియో ఒళ్లు జలదరించేలా ఉంది. సెకన్ల వ్యవధిలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురికాబోతోందన్న సమయంలో ఎవరో ఒక ప్రయాణికుడు తన ఫోన్ లో చిత్రీకరించిన వీడియో ఇది. బోగీలో నడుస్తూ సదరు ప్రయాణికుడు ఈ వీడియోను చిత్రీకరించినట్టున్నారు. రాత్రి సమయంలో రైల్లోని పారిశుద్ధ్య కార్మికుడు ట్రైన్ ఫ్లోర్ ని శుభ్రం చేస్తున్నాడు. ప్రయాణికులు వారి బెర్త్ లపై రిలాక్స్ డ్ గా పడుకున్నారు. ఇంతలోనే బోగీ పెద్ద కుదుపుకు గురయింది. వీడియో తీస్తున్న కెమెరా కూడా షేక్ అయిపోయింది. మొత్తం చీకటిగా మారిపోయింది. ప్రయాణికుల హాహాకారాలు వినిపించాయి. అక్కడితో వీడియో ఆగిపోయింది. ఇదంతా కూడా క్షణాల వ్యవధిలో జరిగిపోయింది.


Accident
Video
Coromandel Express
Visuals

More Telugu News