Sourav Ganguly: ఫీల్డింగ్ కూర్పు ఏం బాగోలేదు!: రోహిత్ శర్మపై గంగూలీ అసహనం

Sourav Ganguly Slams Rohit Sharmas Captaincy

  • డబ్ల్యుటీసీ ఫైనల్ తొలి రోజు తేలిపోయిన భారత్
  • ప్రధానంగా ఫీల్డింగ్ మోహరింపుపై విమర్శలు
  • ఆసిస్ బౌలర్లు ఈజీగా పరుగులు చేసేలా ఫీల్డింగ్ కూర్పు ఉందన్న గంగూలీ

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ తొలి రోజు ఆటలో భారత్ పై ఆసిస్ పైచేయి సాధించింది. ఇందుకు ప్రధాన కారణాల్లో ఫీల్డింగ్ ఒకటి. తొలి సెషన్ లో దూకుడు ప్రదర్శించిన భారత బౌలర్లు.. ఆ తర్వాత ట్రావిస్ హెడ్ అద్భుత బ్యాటింగ్ తో నిరుత్సాహానికి గురయ్యారు. ప్రధానంగా ఫీల్డింగ్ మోహరింపు బాగాలేదనే వాదనలు వినిపించాయి. ఆసిస్ బౌలర్లు సునాయాసంగా పరుగులు చేస్తున్నప్పటికీ ఫీల్డింగ్ కూర్పు ఏమాత్రం బాగా లేదని సౌరవ్ గంగూలీ అన్నాడు.

తొలి రోజు మ్యాచ్ లో టీమిండియా తీవ్రంగా నిరాశపరిచిందని, ఆసిస్ 76 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన సమయంలో పై చేయి సాధించాల్సి ఉందని, కానీ భారత్ చేతులెత్తేసిందన్నాడు. లంచ్ బ్రేక్ తర్వాత రెండో ఓవర్ లోనే వికెట్ సాధించిన భారత్ ఆ తర్వాత మాత్రం ప్రదర్శన కనబరచలేదన్నాడు. ట్రావిస్ పరుగులు చేసేలా ఫీల్డింగ్ ఉందని, అలవోకగా షాట్లు కొట్టాడని తెలిపాడు. అతను మంచి ఫామ్ లో ఉన్నప్పటికీ, కెప్టెన్ రోహిత్ ఫీల్డింగ్ ప్లేస్ మెంట్ సరిగ్గా లేకపోవడం ట్రావిస్ దూకుడుకు తోడైందన్నాడు.  

More Telugu News