Megha Akash: రాజకీయ నాయకుడి కొడుకుతో మేఘా ఆకాశ్ డేటింగ్? 

Megha Akash dating with politician son

  • తమిళనాడు పొలిటీషియన్ కొడుకు ప్రేమలో మేఘ ఉందంటూ ప్రచారం
  • ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు
  • ఇంత వరకు స్పందించని మేఘ

చెన్నై బ్యూటీ మేఘా ఆకాశ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగులో పలు చిత్రాల్లో నటించిన మేఘకు అభిమానులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. మరోవైపు మేఘ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. తమిళనాడుకు చెందిన ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి కొడుకుతో ఆమె డేటింగ్ చేస్తోందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని, త్వరలోనే ఎంగేజ్ మెంట్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు చెపుతున్నారు. అయితే దీనిపై మేఘా ఆకాశ్ నుంచి కానీ... ఆమె టీమ్ నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Megha Akash
Tollywood
Bollywood
Dating
  • Loading...

More Telugu News