Sara Ali Khan: శుభమన్‌గిల్‌ను పెళ్లాడేందుకు అభ్యంతరం లేదు.. బాలీవుడ్ నటి సారా అలీఖాన్

Sara Ali Khan answers about dating with Shubman Gill

  • ‘జర హట్ కే జర బచ్ కే’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా సారా ఇంటర్వ్యూ
  • శుభమన్ గిల్‌తో డేటింగ్ వార్తలపై స్పందన
  • తన విలువలను గౌరవించే వ్యక్తిని పెళ్లాడతానని స్పష్టీకరణ

టీమిండియా యవ ఆటగాడు శుభమన్ గిల్‌ను పెళ్లి చేసుకునేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని బాలీవుడ్ నటి సారా అలీఖాన్ పేర్కొన్నారు. విక్కీ కౌశల్‌తో నటించిన తాజా చిత్రం ‘జర హట్‌ కే జర బచ్ కే’ ప్రమోషనల్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

నానమ్మ షర్మిలా ఠాగూర్ క్రికెటర్ మన్సూర్‌ను పెళ్లి చేసుకున్నట్టుగానే మీరు కూడా క్రికెటర్‌ను పెళ్లాడతారా? అన్న ప్రశ్నకు నటి స్పందిస్తూ.. తన మానసిక, ఆధ్యాత్మిక విలువలకు సరితూగే వ్యక్తి దొరికినప్పుడు తప్పకుండా అతడితో జీవితాన్ని ప్రారంభిస్తానని చెప్పారు. 

అతడు క్రికెటర్, నటుడు, వ్యాపారవేత్త.. ఏ రంగానికి చెందినవాడైనా పర్వాలేదని, కాకపోతే తన విలువలను గౌరవిస్తే చాలని వివరించారు. క్రికెటర్ శుభమన్‌గిల్‌తో డేటింగ్‌తో ఉన్నట్టు వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. తన జీవిత భాగస్వామిని ఇంకా కలవలేదని, కలిశానని కూడా తాను అనుకోవడం లేదని సారా స్పష్టం చేశారు.

Sara Ali Khan
Shubman Gill
Bollywood
Zara Hatke Zara Bachke
  • Loading...

More Telugu News