: నిరుద్యోగులకు బంపర్ బొనాంజా
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు బంపరాఫర్ ప్రకటించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 33,738 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. స్ధానిక ఎన్నికలు, వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఏపీపీఎస్సీ, రాష్ట్ర స్థాయి పోలీస్ నియామకాల మండలి, జిల్లా స్థాయి ఎంపిక కమిటీలు(డీఎస్సీ) వీటిని చేపడతాయి. అనుమతించిన వాటిలో 34 శాఖల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 ఉద్యోగాలతో పాటు ఇతర గెజిటెడ్, నాన్ గెజిటెడ్, సాంకేతిక వర్గీకరణల్లోని ఉద్యోగాలు ఉన్నాయి. నియామక సంస్థలు ఆయా శాఖల నుంచి ఖాళీల నివేదిక తెప్పించుకుని అందుకు అనుగుణంగా నియామకాలు చేపడతాయి.