Nara Lokesh: రాయలసీమపై లోకేశ్ హామీల వర్షం... వివరాలు ఇవిగో!
- కడప జిల్లాలో లోకేశ్ యువగళం
- కడపలో రాయలసీమ ప్రముఖులతో సమావేశం
- మిషన్ రాయలసీమ పేరిట తాము వస్తే ఏంచేస్తామో చెప్పిన లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కడప జిల్లాలో కొనసాగుతుంది. ఇందులో భాగంగా నేటి సాయంత్రం కడప రాజరాజేశ్వరి కల్యాణమండపం ఎదుట ఉన్న ప్రాంగణంలో లోకేశ్ రాయలసీమ ప్రముఖులతో సమావేశమయ్యారు. ఈ మిషన్ రాయలసీమ కార్యక్రమంలో లోకేశ్ మాట్లాడుతూ, టీడీపీ అధికారంలోకి వస్తే రాయలసీమకు తాము ఏం చేస్తామో చెప్పారు. ఆ మేరకు రాయలసీమపై హామీల వర్షం కురిపించారు.
రైతాంగానికి లోకేశ్ హామీలు
- హార్టి కల్చర్ హబ్ గా రాయలసీమ
- సీమ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించడం
- మామిడి, బొప్పాయి, దానిమ్మ, చీని, అరటి తదితర పంటలు వేసేందుకు ప్రోత్సాహం.
- 90 శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్.
- వివిధ హార్టికల్చర్ పంటలకు రీసెర్చ్ సెంటర్ల ఏర్పాటు.
- దేశానికి, అంతర్జాతీయ స్థాయిలో ఉత్పత్తులు ఎక్స్ పోర్ట్ చేసే విధంగా కొత్త రకాల మొక్కలు తయారు చేసే విధంగా రీసెర్చ్ సెంటర్ల ఏర్పాటు.
- టొమాటో వాల్యూ చైన్ ఏర్పాటు.
- పెట్టుబడి తగ్గించి, గిట్టుబాటు ధర కల్పిచడం.
- వ్యవసాయానికి వినియోగించే యంత్రాలు, పరికరాలు ఏపీలో తయారు చేసి తక్కువ ధరకే సబ్సిడీలో రైతులకి అందించడం.
- సీడ్ హబ్ గా ఏపి ని మార్చడం.
- నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందేలా ప్రత్యేక కార్యాచరణ.
- పాత బీమా పథకాన్ని అమలు చెయ్యడం.
- రైతు బజార్లు పెంపు.
- ప్రతి ఎకరాకు సాగునీరు అందించడం లక్ష్యం.
- వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎటువంటి పంటలు వెయ్యాలి అనే దానిపై ప్రభుత్వం నుండే సలహాలు.
- ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పల్పింగ్ యూనిట్లు ఏర్పాటు.
- కొనుగోలు కేంద్రాలు, మిర్చి, పసుపు పంటలకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు.
- కౌలు రైతులను గుర్తించి భూ యజమానులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సాయం అందించడం.
- పాడి రైతుల్ని ఆదుకోవడానికి ప్రత్యేక ప్రణాళిక.
- పశువుల కొనుగోలు దగ్గర నుండి మేత, మందులు వరకూ అన్నీ సబ్సిడీలో అందజేత.
- గోకులం కేంద్రాలు ఏర్పాటు.
- గొర్రెలు, మేకల పెంపకం కోసం ప్రత్యేక సాయం, ఉచితంగా గొర్రెలు, మేకల పంపిణీ.
- మేత కోసం బంజరు భూములు కేటాయింపు.
- ఫార్మ్స్ ఏర్పాటు కు సబ్సిడీ రుణాలు.
ఇతర హామీలు
- వాటర్ గ్రిడ్ పథకం ద్వారా సీమలోని ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందించడం.
- సీమ జిల్లాలను ఆటో మొబైల్, ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చడం.
- దగ్గర్లో ఉన్న బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్లను వినియోగించుకొని పారిశ్రామిక అభివృద్ధి.
- పెద్ద ఎత్తున ఆటో మొబైల్, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తీసుకొచ్చి స్థానికంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పన.
- రాయలసీమ లో పెద్ద ఎత్తున ఉన్న మైనింగ్ పరిశ్రమను మరింతగా ప్రోత్సహించడం.
- మైనింగ్ లో కేవలం రా మెటీరియల్ ఉత్పత్తి మాత్రమే కాకుండా ఫైనల్ ప్రొడక్ట్ తయారీ వరకూ పూర్తి వాల్యూ చైన్ మొత్తం రాష్ట్రంలో ఏర్పాటు చేయడం.
- మైనింగ్ లో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా స్కిల్డ్ పనులు కూడా మనం రాష్ట్రం వాళ్ళే చేసే విధంగా నైపుణ్య శిక్షణ.
- సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్స్ తయారీ చేసే కంపెనీలను పెద్ద ఎత్తున తీసుకురావడం.
- డిఫెన్స్ పరికరాల తయారీ కంపెనీలు ఏర్పాటు.
- స్పోర్ట్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా రాయలసీమ.
- రాయలసీమలో స్పోర్ట్స్ యూనివర్సిటీ.
- అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రీడా పోటీలకు క్రీడాకారులను పంపే లక్ష్యంతో స్పోర్ట్స్ అభివృద్ది.
- క్రికెట్, ఫుట్ బాల్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, ఇలా అన్ని రకాల క్రీడలకు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీలు, స్టేడియంలు.
- పర్యాటక కేంద్రంగా రాయలసీమ అభివృద్ది.
- టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, టైగర్ ఎకో టూరిజం ఏర్పాటు.
- తద్వారా గిరిజనులు, చెంచులకు ఉపాధి అవకాశాలు, ఎంతో మంది స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు.