Harshith Reddy: 'అర్థమయ్యిందా అరుణ్ కుమార్' ఫస్టులుక్ రిలీజ్ .. 'ఆహా' నుంచి మరో వెబ్ సిరీస్!

Arthamainda Arunkumar Web Series

  • కొత్త వెబ్ సిరీస్ గా 'అర్థమయ్యిందా అరుణ్ కుమార్'
  • కార్పొరేట్ సంస్థ నేపథ్యంలో నడిచే కథ 
  • వినోదంతో కూడిన సందేశాన్ని అందించిన వెబ్ సిరీస్ 
  • ప్రధానమైన పాత్రలో నటించిన హర్షిత్ రెడ్డి   

'ఆహా' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి కొత్త కొత్త వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. రీసెంట్ గా 'ఆహా' వదిలిన 'సత్తిగాని రెండెకరాలు' వెబ్ సిరీస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక త్వరలో మరో వెబ్ సిరీస్ ను వదలడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ వెబ్ సిరీస్ పేరే 'అర్థమయ్యిందా అరుణ్ కుమార్'.

జోనాథన్ ఎడ్వర్డ్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ కి, ఈ రోజునే టైటిల్ ను ఖరారు చేసి .. ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు. ఒక కార్పొరేట్ సంస్థలో పనిచేసే ఉద్యోగి పరిస్థితి ఎలా ఉంటుందనడానికి నిదర్శనంగా ఈ పోస్టర్ కనిపిస్తోంది. కామెడీ టచ్ తో ఈ వెబ్ సిరీస్ నడుస్తుందనే విషయం అర్థమవుతోంది. 

అమలాపురానికి చెందిన అరుణ్ కుమార్ అనే వ్యక్తి హైదరాబాద్ లోని ఒక కార్పొరేట్ సంస్థలో చేరతాడు. అక్కడి మనుషులు .. వాళ్ల మనస్తత్వాలు .. జరిగే రాజకీయాలు చూసి ఎలా స్పందిస్తాడు? ఏం చేస్తాడు? అనేది కథ. హర్షిత్ రెడ్డి .. అనన్య శర్మ .. తేజస్వి మదివాడ ప్రధానమైన పాత్రలను పోషించారు.

Harshith Reddy
Ananya Sharma
Tejaswi Madiwada
  • Loading...

More Telugu News