Ayyanna Patrudu: ఏళ్ల తరబడి కోర్టుకు వెళ్లకుండా ఉన్న ఘనత జగన్ దే: అయ్యన్నపాత్రుడు

Ayyanna Patrudu fires on Jagan

  • వివేకా హత్య కేసులో ఆఫ్ట్రాల్ ఒక ఎంపీని అరెస్ట్ చేయలేకపోయారన్న అయ్యన్న
  • వైసీపీ ఎంపీలకు అవినాశ్ ను కాపాడటం మినహా మరో పని లేదని విమర్శ
  • వైఎస్ సునీతకు అభినందనలు తెలియజేసిన వైనం

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆఫ్ట్రాల్ ఒక ఎంపీని అరెస్ట్ చేయలేకపోయారని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు విమర్శించారు. వైసీపీకి చెందిన 30 మంది ఎంపీలకు అవినాశ్ రెడ్డిని కాపాడటం తప్ప మరే పని లేదని అన్నారు. కర్నూలులో వైసీపీ గూండాలు సీబీఐని అడ్డుకోవడం వెనుక పెద్దల హస్తం ఉందని చెప్పారు. వివేకా హత్య కేసులో అలుపెరుగని పోరాటం చేస్తున్న సునీతను అభినందించారు. ప్రజలంతా సునీతకు మద్దతుగా నిలవాలని కోరారు. ఏళ్ల తరబడి కోర్టుకు వెళ్లకుండా ఉన్న ఘనత దేశ చరిత్రలో జగన్ కే దక్కుతుందని చెప్పారు.

Ayyanna Patrudu
Telugudesam
Jagan
Avinash Reddy
YSRCP
  • Loading...

More Telugu News