Balakrishna: బాలయ్య సినిమాకి 108 ప్రాంతాల్లో 108 హోర్డింగ్స్!

Balakrishna 108 Movie Update

  • షూటింగు దశలో బాలయ్య 108వ సినిమా 
  • ఈ నెల 8వ తేదీన టైటిల్ లాంచ్
  • సంగీతాన్ని అందిస్తున్న తమన్ 
  • దసరాకి సినిమా విడుదల

ప్రస్తుతం బాలకృష్ణ తన 108వ సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి, అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేశారు. ఇంతవరకూ ఈ సినిమాకి టైటిల్ ను ఎనౌన్స్ చేయలేదు. 

ఈ నెల 10వ తేదీన బాలయ్య బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను ఈ నెల 8వ తేదీన లాంచ్ చేయనున్నారు. ఇది బాలకృష్ణకి 108వ సినిమా కావడంతో, సంఖ్యా పరంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. అందువలన తెలుగు రాష్ట్రాల్లో .. 108 ప్రదేశాల్లో .. 108 భారీ హోర్డింగ్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. 

టైటిల్ ను ఇలా లాంచ్ చేయగానే .. అలా ఈ 108 హోర్డింగ్స్ పై టైటిల్ పోస్టర్స్ ఆవిష్కృతమవుతాయి. టాలీవుడ్ లోనే ఇలా చేయడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. బాలయ్య సరసన నాయికగా కాజల్ .. ఆయన కూతురుగా శ్రీలీల కనిపించనున్నారు. తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాను, దసరాకి విడుదల చేయనున్నారు. 

Balakrishna
Kajal Agarwal
Sreeleela
  • Loading...

More Telugu News