Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం ఏడి? .. ఎక్కడా జాడ లేడేం?

Kiran Abbavaram Special

  • ఎలాంటి సినిమా నేపథ్యం లేని కిరణ్ అబ్బవరం
  • వరుస సినిమాలతో స్పీడ్ చూపించిన హీరో 
  • కొత్త ప్రాజెక్టులలో కనిపించని పేరు 
  • సైలెంట్ అయిన హీరో  

ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా హీరోగా తెరపైకి రావడం అంత ఆషా మాషీ విషయమేం కాదు. ఒకవేళ అలా ఎంట్రీ ఇచ్చినా సినిమాకి .. సినిమాకి మధ్య అవకాశాల కోసం చాలా కష్టాలు పడవలసి ఉంటుంది. ఎంత కష్టపడినా పెద్ద బ్యానర్లు పిలిచి మరీ ఛాన్సులు ఇవ్వడానికి చాలా కాలం పడుతుంది. కానీ కిరణ్ అబ్బవరం అందుకు పూర్తిభిన్నంగా కనిపించాడు. 

బలమైన సినిమా నేపపథ్యం కలిగిన హీరోలు .. వారసులుగా రన్నింగ్ రేసులో ఉన్నవారే ఒక్కో సినిమాను చేసుకుంటూ వెళుతుంటే, కిరణ్ అబ్బవరం వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది. క్రితం ఏడాది మూడు సినిమాలను థియేటర్లకు తీసుకొచ్చిన ఆయన, ఆల్రెడీ ఈ ఏడాది అప్పుడే రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చాడు. 

సినిమాకి .. సినిమాకి మధ్య కిరణ్ పరిణతిని చూపిస్తూ వెళ్లాడు. డాన్సులలో .. ఫైట్లలో తనకంటూ ఒక స్టైల్ ను సెట్ చేసుకోవడం మొదలెట్టాడు. అలాంటి కిరణ్ నుంచి ఈ ఏడాది వచ్చిన సినిమాలు అంతంత మాత్రంగా ఆడాయి. అప్పటి నుంచి కొత్త ప్రాజెక్టులలో ఆయన పేరు కనిపించడం లేదు .. వినిపించడం లేదు. ఇంతకీ కిరణ్ అబ్బవరం ఎక్కడ ఉన్నట్టు? ఏం చేస్తున్నట్టు? 

More Telugu News