Rohit Sharma: ఆసిస్‌తో కీలక మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మకు గాయం భయం!

Injury concern for India as Rohit Sharmas thumb wrapped in bandage

  • రేపటి నుండి భారత్-ఆసిస్ డబ్ల్యుటీసీ ఫైనల్
  • ఉదయం ప్రాక్టీస్ సమయంలో రోహిత్ శర్మ ఎడమ చేతి బొటనవేలికి గాయం!
  • చేతికి బ్యాండేజ్ తో మళ్లీ ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్న రోహిత్

భారత్ - ఆసిస్ మధ్య రేపటి నుండి ప్రారంభం కానున్న డబ్ల్యుటీసీ ఫైనల్ కు ముందు భారత్ కు షాక్! టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎడమ చేతి బొటనవేలికి గాయమైనట్లుగా తెలుస్తోంది. మంగళవారం ఉదయం నెట్ ప్రాక్టీస్ సెషన్ సమయంలో అతను గాయపడినట్లుగా తెలుస్తోంది. అతనికి వెంటనే ఫిజియోలు వైద్య సహాయం అందించారు. చేతికి బ్యాండేజ్ వేసుకున్న తర్వాత మళ్లీ ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నాడని సమాచారం. గాయం తీవ్రమైనది కాదు కాబట్టి అధికారిక ప్రకటన లేదని తెలుస్తోంది.

More Telugu News