Elon Musk: బేబీ మస్క్ గా ఎలాన్ మస్క్.. కృత్రిమ మేధ రూపొందించిన చిత్రం వైరల్

Elon Musk Reacts to AI Image Featuring Baby Musk

  • ట్విట్టర్ లో వైరల్ గా మారిన బేబీ మస్క్ ఫొటో
  • ఆ ఫొటోకు స్వయంగా కామెంట్ పెట్టిన టెస్లా అధినేత
  • ఇటీవల మస్క్ ను పెళ్లికొడుకు దుస్తుల్లో చిత్రించిన ఏఐ

భారతీయ సంప్రదాయ వివాహ దుస్తులు ధరించి, గుర్రంపై ఊరేగుతున్న ఎలాన్ మస్క్ ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. అయితే, ఆ ఫొటో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ) చేసిన మాయాజాలమే. తాజాగా టెస్లా కంపెనీ చీఫ్ ఎలాన్ మస్క్ కు సంబంధించిన మరో ఫొటో ట్విట్టర్లో చక్కర్లు కొడుతోంది. మస్క్ చిన్నప్పుడు ఇలా ఉండేవాడంటూ ఏఐ రూపొందించిన బేబీ మస్క్ చిత్రంపై ఎలాన్ మస్క్ కూడా స్పందించారు. ఫొటోను రీట్వీట్ చేస్తూ సరదా కామెంట్ పెట్టారు.

బేబీ మస్క్ పేరుతో ఈ ఫొటోను ట్వీట్ చేస్తూ అమెరికాకు చెందిన ఓ యూజర్ ఫన్నీగా కామెంట్ పెట్టాడు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వయస్సు పెరగకుండా ఉంచే ఫార్ములాను కనుగొన్నాడని, దానిని తొలుత తనే వినియోగించాడని చెప్పాడు. అయితే, ఆ ఫార్ములా కాస్తా వికటించి ఎలాన్ మస్క్ ఇలా మారిపోయాడంటూ జోక్ చేశాడు. ఈ ట్వీట్ కు 48 గంటల్లో 40 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

More Telugu News