Nithin: మరోసారి నితిన్ జోడీగా కృతి శెట్టి?

Krithi shetty in Nithin Movie

  • ఫ్లాపులతో సతమతమవుతున్న కృతి శెట్టి 
  • కలిసిరాని 'కస్టడీ' సినిమా 
  • నితిన్ - వెంకీ కుడుముల సినిమాలో ఛాన్స్
  • గతంలో నితిన్ తో 'మాచర్ల నియోజక వర్గం' చేసిన కృతి 

ఫస్టు మూవీతోనే కృతి శెట్టి ఎంత క్రేజ్ ను సొంతం చేసుకుందనేది ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. అప్పటి నుంచి కూడా ఆమె వరుస సినిమాలను చేసుకుంటూ వెళుతోంది. అయితే మొదటి మూడు సినిమాలతోనే హ్యాట్రిక్ హిట్ కొట్టిన ఆమె, ఆ తరువాత నుంచి హిట్ ను పట్టుకోవడానికి నానా తంటాలు పడుతోంది. ఏ హీరోతో చేసినా అదే ఫలితం అన్నట్టుగా ఆమె కెరియర్ కొనసాగుతోంది. దాంతో ఏం చేయాలో తోచని అయోమయంలో ఆమె ఉంది. 

నిజానికి చాలా చిన్న వయసులోనే కృతి ఇండస్ట్రీకి వచ్చింది. అందువలన కథలను ఎంచుకునే విషయంలో కాస్త తడబడటం జరుగుతూనే ఉంటుంది. కాస్త అనుభవం వచ్చే లోగా తట్టుకుని నిలబడటమే ఇక్కడ కావలసింది. చైతూతో ఆమె చేసిన 'బంగార్రాజు' హిట్ కొట్టింది. అదే చైతూతో ఆమె చేసిన 'కస్టడీ' మాత్రం ఫ్లాప్ అయింది. ఈ నేపథ్యంలోనే ఆమె మరోసారి నితిన్ జోడీ కడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. 

గతంలో నితిన్ సరసన ఆమె చేసిన 'మాచర్ల నియోజక వర్గం' అంతగా ఆడలేదు. తనకి 'భీష్మ' సినిమాతో హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతోనే నితిన్ ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నాడు. రష్మిక కథానాయికగా ఈ సినిమా షూటింగు జరుపుకుంటోంది. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా కృతి శెట్టిని తీసుకున్నారనేది టాక్. ఇప్పుడు నితిన్ కి మాత్రమే కాదు .. కృతికి కూడా ఈ సినిమా హిట్ చాలా అవసరం. 

Nithin
Krithi Shetty
Venky Kudumula Movie
  • Loading...

More Telugu News