Sai Ronak: ఆసక్తిని రేపుతున్న 'సర్కిల్' .. టీజర్ రిలీజ్!

Circle movie teaser released

  • మరో విభిన్న కథాచిత్రంగా 'సర్కిల్'
  • చాలా గ్యాప్ తరువాత నీలకంఠ చేసిన సినిమా
  • యూత్ ను దృష్టిలో పెట్టుకుని సాగే కంటెంట్  
  • ఆసక్తిని రేపుతున్న టీజర్

మొదటి నుంచి నీలకంఠ విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. ఆయన ఖాతాలో 'మిస్సమ్మ' వంటి విలక్షణమైన సినిమాలు కనిపిస్తాయి. కథలను .. పాత్రలను ఆయన డిజైన్ చేసే విధానం కొత్తగా ఉంటుందనే పేరు ఉంది. అలాంటి నీలకంఠ నుంచి చాలా గ్యాప్ వచ్చేసింది. కొంతకాలంగా ఆయన సినిమాలకి దూరంగా ఉంటూ వచ్చారు . 

అలాంటి నీలకంఠ నుంచి మరో సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఆ సినిమా పేరే 'సర్కిల్'. సాయిరోనక్ హీరోగా శరత్ చంద్ర .. సుమలత .. వేణు బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'ఎవరు ఎప్పుడు ఎందుకు శత్రువులవుతారో' అనేది ఈ సినిమా కాన్సెప్ట్ లైన్. 

తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. యాక్షన్ .. రొమాన్స్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందనే విషయం టీజర్ ను బట్టి అర్థమవుతోంది. ప్రసు సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో కథానాయికలుగా, రిచా పనై .. అర్షిన్ మెహతా కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Sai Ronak
Arshin Mehatha
Richa Panai
Circle Movie

More Telugu News