Pawan Kalyan: బాలీవుడ్ భామతో పవన్, సాయితేజ్‌ ఐటమ్ సాంగ్!

Urvashi Rautela special song in Bro the movie

  • ‘బ్రో’ సినిమాలో నటిస్తున్న మామాఅల్లుళ్లు
  • సముద్రఖని దర్శకత్వంలో సినిమా
  • ఊర్మశీ రౌతేలాతో వచ్చేవారం స్పెషల్ పాట చిత్రీకరణ!

పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌తేజ్‌ కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్రో’. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. కల్యాణ్, సాయితేజ్ కలిసున్న పోస్టర్‌‌ చిత్రంపై ఆసక్తిని, అంచనాలను పెంచింది. ఇటీవలే సినిమా డబ్బింగ్ కూడా స్టార్ట్ చేసిన చిత్ర బృందం ఈ వారంలో ఐటమ్ సాంగ్‌ను చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రత్యేక గీతంలో పవన్, సాయితేజ్‌ తో పాటు ఓ బాలీవుడ్ నటి కూడా నటించనుందని తెలుస్తోంది. ఆ చాన్స్‌ ఊర్వశి రౌతేలాకే దక్కిందని సమాచారం. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యలో బాస్ పార్టీ, అక్కినేని అఖిల్‌ ఏజెంట్‌ చిత్రంలో స్పెషల్ సాంగ్స్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

దాంతో, ఐటమ్ సాంగ్స్‌ లో ఆమెకు డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే ‘బ్రో’ నుంచి కూడా ఆమెకు ఆఫర్ వెళ్లగా వెంటనే ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. కాగా, ఊర్వశి పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘ఖుషి’ సినిమా చూసింది. ఈ విషయాన్ని ఆదివారం స్వయంగా ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఈ లెక్కన ‘బ్రో’ ప్రత్యేక గీతానికి ఊర్వశి రెడీ అవుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఈ పాటకు సంబంధించి పబ్‌ సెట్‌ను సిద్ధం చేశారని, దీనికి గణేశ్‌ మాస్టర్, భాను మాస్టర్‌ కొరియోగ్రఫీ చేస్తారని తెలుస్తోంది. కాగా, ఈ చిత్రం జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News