Team India: కొత్త టెస్టు జెర్సీల్లో టీమిండియా ప్లేయర్ల ఫొటోషూట్.. అదిరిపోయిన లుక్

Team India players Photo shoot in new test jerseys

  • భారత జట్టు కిట్ స్పాన్సర్‌‌గా అడిడాస్
  • మూడు ఫార్మాట్లకు సరికొత్త జెర్సీల రూపకల్పన
  • ఈనెల 7 నుంచి కొత్త జెర్సీతో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడనున్న భారత్

రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత క్రికెట్ జట్టు ఈ నెల 7 నుంచి ఆస్ట్రేలియా జట్టుతో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో తలపడనుంది. లండన్‌ లోని ఓవల్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో భారత జట్టు కొత్త జెర్సీ ధరించి బరిలోకి దిగనుంది. భారత జాతీయ జట్టుకి కిట్ స్పాన్సర్‌‌ గా ఎంపికైన అడిడాస్ ఈ కొత్త జెర్సీని రూపొందించింది. మూడు ఫార్మాట్లకు ప్రత్యేక జెర్సీలను విడుదల చేసింది. డబ్ల్యూటీసీ ఫైనల్ కు ముందు టెస్టు జెర్సీతో కెప్టెన్ రోహిత్, విరాట్ కోహ్లీ సహా జట్టు ఆటగాళ్లంతా ఫొటో షూట్ లో పాల్గొన్నారు. అదిరిపోయే స్టిల్స్‌ ఇచ్చారు. వీటిని బీసీసీఐ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

More Telugu News