Pawan Kalyan: హైదరాబాద్ లో పవన్ కల్యాణ్ 'ఓజీ' మూడో షెడ్యూల్ ప్రారంభం

Pawan Kalyan OG third schedule starts in Hyderabad today

  • గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్న పవన్ కల్యాణ్
  • సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ఓజీ
  • ఇటీవలే హైదరాబాదులో రెండో షెడ్యూల్ పూర్తి
  • తాజాగా హైదరాబాదులోనే మరో షెడ్యూల్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా యువ దర్శకుడు సుజీత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న గ్యాంగ్ స్టర్ మూవీ ఓజీ. ఇటీవల ఈ చిత్రం ముంబయి, పూణే ప్రాంతాల్లో ఓ భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అనంతరం హైదరాబాదులో రెండో షెడ్యూల్ కూడా ముగిసింది. 

తాజాగా ఈ చిత్రం మూడో షెడ్యూల్ హైదరాబాదులోనే నేడు ప్రారంభమైంది. చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ దీనికి సంబంధించిన అప్ డేట్ ను సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. మరికొన్ని రోజుల్లో పవన్ కల్యాణ్ కూడా షూటింగ్ లో పాల్గొంటాడని తెలిపింది. 

కాగా, ఓ అభిమాని డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ ట్వీట్ పై వ్యాఖ్యానిస్తూ, "వర్కింగ్ స్టిల్స్ ఇవ్వు బాబాయ్" అని రిక్వెస్ట్ చేయగా... అందుకు డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ స్పందిస్తూ, "ఓజీ వచ్చాక ఇద్దాం అబ్బాయ్" అంటూ సరదాగా బదులిచ్చింది. 

ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తోంది.

Pawan Kalyan
OG
Sujith
Third Schedule
Hyderabad
Tollywood
  • Loading...

More Telugu News