Sudarshan: ఒడిశా రైలు ప్రమాద ఘటనకు ఇసుకతో రూపాన్నిచ్చిన సైకత శిల్పి సుదర్శన్
- ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం
- 288 మంది మృతి
- 900 మందికి పైగా గాయాలు
- పూరీ బీచ్ లో ప్రమాద ఘటనను కళ్లకు కట్టిన సుదర్శన్
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఓ గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొనగా, పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ బోగీలను బెంగళూరు-హౌరా ఎక్స్ ప్రెస్ ఢీకొంది. ఈ ఘటనలో 288 మంది వరకు మృతి చెందగా, 900 మందికి పైగా గాయాలపాలయ్యారు.
ఈ రైలు ప్రమాద ఘటనకు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ ఇసుకతో రూపాన్నిచ్చారు. ప్రమాద ఘటన తీవ్రతను పూరీ బీచ్ లో తన కళానైపుణ్యంతో ఆవిష్కరించారు. ఓవైపు నుజ్జునుజ్జయిన బోగీలు, మరోవైపు పూరీ జగన్నాథుడి కంట రక్తకన్నీరుతో సుదర్శన్ భావోద్వేగ ప్రదర్శన చేశారు. గాయపడిన వారు కోలుకోవాలని ఆకాంక్షిస్తున్న వైనాన్ని కూడా ఇసుకపై రాశారు.