Rajasthan: నలుగురు పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి

Rajasthan Woman allegedly kills her four children and committed suicide

  • రాజస్థాన్‌లోని బార్మెర్ జిల్లాలో ఘటన
  • పిల్లల్ని స్టీలు డ్రమ్ములో దించి తాళం వేసిన తల్లి
  • ఊపిరి ఆడక మృతి
  • భార్యాభర్తల మధ్య గొడవే కారణమని అనుమానం

రాజస్థాన్‌లోని బార్మెర్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ తల్లి తన నలుగురు చిన్నారులను చంపి ఆత్మహత్య చేసుకుంది. చిన్నారుల్లో ముగ్గురు అమ్మాయిలు కాగా, ఒకరు బాలుడు. ఓ స్టీల్ డమ్ములో పిల్లల్ని దించి తాళం వేయడంతో వారు ఊపిరి ఆడక చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.  

 27 ఏళ్ల నిందితురాలి భర్త మైనింగ్ కార్మికుడని, అతడు విధులకు వెళ్లిన తర్వాత ఈ ఘటన జరిగిందని తెలిపారు. భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని, పిల్లలను ఆమె చంపేందుకు ఇదే కారణం అయి ఉండొచ్చని స్థానికులు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News