Hyderabad: హమ్మయ్య.. హైదరాబాద్‌లో చల్లబడిన వాతావరణం

Rain in Several Places Of Hyderabad

  • నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు
  • ఉదయం నుంచి మేఘావృతమైన ఆకాశం
  • నిన్న గరిష్ఠంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

ఎండ, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న హైదరాబాద్ ప్రజలకు ఆదివారం కాస్త ఊరట లభించింది. నగరంలో వాతావరణ చల్లబడింది. ఉదయం పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. తెల్లవారుజామున నగర శివార్లలోని దుండిగల్‌, గండిమైసమ్మ, బహదూర్‌పల్లిలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. దాంతో, వాతావరణం కొద్దిగా చల్లబడింది. ఆకాశం మేఘావృతమై ఉంది. 

కాగా, గ్రేటర్‌ హైదరాబాద్‌లో శనివారం రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్ఠంగా 42.4, కనిష్ఠం 30.0 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ కేంద్రం తెలిపింది.

Hyderabad
rain
cool weather
  • Loading...

More Telugu News