Keerthy Suresh: పెళ్లి గురించి అడిగితే ఘాటుగా స్పందించిన కీర్తి సురేశ్
- కీర్తి పెళ్లి చేసుకోబోతోందని పెద్ద ఎత్తున ప్రచారం
- తన పెళ్లి గురించి అంత ఆసక్తి ఎందుకని ప్రశ్నించిన కీర్తి
- పెళ్లి ఫిక్స్ అయితే తానే స్వయంగా చెపుతానని అసహనం
తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్లలో కీర్తి సురేశ్ ఒకరు. టాలీవుడ్ లో తొలి సినిమా 'నేను శైలజ'తోనే ఆమె తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. ఆ తర్వాత 'మహానటి' సినిమాతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగింది. మరోవైపు కీర్తి పెళ్లి చేసుకోబోతోందంటూ ఇటీవలి కాలంలో జోరుగా ప్రచారం సాగుతోంది. అలాంటిది ఏమీ లేదని ఇప్పటికే కీర్తి, ఆమె కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చారు.
ఇక తాజాగా ఓ ప్రెస్ మీట్ లో కీర్తికి ఇదే ప్రశ్న ఎదురయింది. దీంతో ఆమె ఘాటుగా స్పందించింది. తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చానని, అయినా మళ్లీ ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించింది. తన పెళ్లిపై అంత ఆసక్తి ఎందుకని అడిగింది. ఈ అంశంపై ప్రతిసారి తనను అడగాల్సిన అవసరం లేదని... తన పెళ్లి ఫిక్స్ అయితే తానే స్వయంగా చెపుతానని అసహనం వ్యక్తం చేసింది.