Nithin Gopi: కన్నడ సినీ పరిశ్రమలో విషాదం.. యువనటుడు నితిన్ గోపి మృతి

Sandalwood actor Nithin Gopi dead

  • గుండెపోటుతో మృతి చెందిన నితిన్ గోపి
  • చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించిన నితిన్
  • నితిన్ వయసు 39 ఏళ్లు

సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కన్నడ చిత్రసీమకు చెందిన యువనటుడు నితిన్ గోపి మృతి చెందాడు. 39 ఏళ్ల నితిన్ గోపి నిన్న రాత్రి గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచాడు. 

నితిన్ మరణంతో శాండల్ వుడ్ షాక్ కు గురైంది. నితిన్ తన తల్లిదండ్రులతో కలసి బెంగళూరులోని ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించిన నితిన్ పలు చిత్రాల్లో నటించాడు. సీరియల్స్ లో కూడా యాక్ట్ చేశాడు. ఒక కొత్త సీరియల్ కు దర్శకత్వం వహించేందుకు సిద్ధమవుతుండగా విషాదం చోటు చేసుకుంది.

Nithin Gopi
Sandalwood
  • Loading...

More Telugu News