Adipurush: తిరుపతిలో ఆదిపురుష్​ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడు, ఎక్కడంటే!

Adipurush Pre Release Event at tirupathi on 6th june

  • ఈనెల 6న శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో నిర్వహణ
  • భారీ స్థాయిలో ఈవెంట్ ఉంటుందని టాక్
  • ఈ నెల 16న విడుదల కానున్న సినిమా  

ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటించిన ‘ఆదిపురుష్’ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ప్యాన్ ఇండియా చిత్రం ఈనెల 16వ తేదీన విడుదల కానుంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమాలో కృతీ సనన్ సీత పాత్ర పోషించగా.. సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే విడుదల కావాల్సి ఉన్నా.. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ నాసిరకంగా ఉన్నాయన్న విమర్శల నేపథ్యంలో వాటిని తీర్చిదిద్దేందుకు చిత్ర బృందం సినిమాను వాయిదా వేసింది. ఇప్పుడు రిలీజ్ డేట్ దగ్గర పడుతుండగా ప్రమోషన్లలో జోరు పెంచేసింది. 

వరుస పోస్టర్లతో పాటు టీజర్, ట్రైలర్, పాటలు విడుదల చేస్తూ హైప్ తెస్తోంది. తాజాగా సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ను భారీ స్థాయిలో చేయాలని నిర్ణయించింది. అందుకు వేదికగా పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి నగరాన్ని ఎంచుకుంది. ఈ నెల 6వ తేదీ మంగళవారం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో ఈ వేడుక నిర్వహిస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఆరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఈ ఈవెంట్ మొదలవుతుందని తెలిపింది. ప్రీ రిలీజ్‌ వేడుకకు ప్రభాస్, కృతీ సహా ప్రధాన తారాగనం, సాంకేతిక నిపుణులు హాజరు కానున్నారు. వేడుకకు వచ్చే అతిథులు వివరాలు తెలియాల్సి ఉంది.

Adipurush
Prabhas
Pre Release Event
tirupathu
june6

More Telugu News