Manish Sisodia: భార్యను చూడటం కోసం జైలు నుంచి ఇంటికి చేరుకున్న మనీశ్ సిసోడియా

Manish Sisodia reaches home from jail

  • ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సిసోడియా
  • ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఇంట్లో గడపడానికి హైకోర్టు అనుమతి
  • కుటుంబ సభ్యులు మినహా ఎవరినీ కలవకూడదని షరతు

ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియా తీహార్ జైలు నుంచి ఇంటికి చేరుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను చూసేందుకు ఢిల్లీ హైకోర్టు నిన్న అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంటికి వెళ్లడానికి అనుమతించింది. ఈ క్రమంలో ఆయన జైలు నుంచి ఇంటికి చేరుకున్నారు. 

మరోవైపు హైకోర్టు షరతుల ప్రకారం సిసోడియా తన ఇంట్లో కూడా పోలీసుల అధీనంలోనే ఉండాలి. మీడియాతో మాట్లాడకూడదు. ఫోన్ లేదా ఇంటర్నెట్ వాడటం చేయకూడదు. కుటుంబ సభ్యులు మినహా మరెవరినీ కలవకూడదు. మనీశ్ సిసోడియా భార్య మెడికల్ రిపోర్టును కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 9న సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది.

More Telugu News