Telangana: తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

Rain threat for telangana for four days

  • తేలికపాటి వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం
  • ప్రస్తుతం ఎండ, ఉక్కపోతతో జనం సతమతం
  • రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో వర్షాలు

విపరీతమైన ఎండ, ఉక్కపోతతో సతమతం అవుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం, సోమవారం రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. దాంతో, ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. మరోవైపు ఈ రోజు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని తెలిపింది. పగటి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 28 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.

Telangana
rain
forecast
4 days
yellow alert
  • Loading...

More Telugu News