mobile phone: ఫేక్, స్పామ్ ఫోన్ కాల్స్‌పై కేంద్రమంత్రి హెచ్చరిక

Union minister warning On spam calls

  • గుర్తు తెలియని నెంబర్ల నుండి ఫోన్ వస్తే లిఫ్ట్ చేయవద్దని సూచన
  • టెలికం శాఖ చర్యల వల్ల స్పామ్, సైబర్ మోసాలు తగ్గాయని వ్యాఖ్య
  • గుర్తు తెలియని నెంబర్ నుండి మెసేజ్ వస్తే వ్యక్తిని నిర్ధారించుకోవాలని సూచన

మొబైల్ ఫోన్లకు గుర్తు తెలియని నెంబర్ల నుండి ఫోన్ కాల్స్ వస్తే లిఫ్ట్ చేయవద్దని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రజలకు సూచించారు. కేంద్ర టెలికం మంత్రిత్వ శాఖ తీసుకున్న చర్యల ఫలితంగా స్పామ్ కాల్స్, సైబర్ మోసాలకు సంబంధించిన కేసులు భారీగా తగ్గినట్లు చెప్పారు. తెలియని నెంబర్ల నుండి వచ్చే కాల్స్ కు ఎట్టి పరిస్థితుల్లో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయవద్దన్నారు. గుర్తించిన నెంబర్లకే స్పందించాలని సూచించారు. అదే సమయంలో గుర్తు తెలియని నెంబర్ నుండి మెసేజ్ వస్తే ఆ వ్యక్తి ఎవరో నిర్ధారించుకున్న తర్వాతే స్పందించాలన్నారు.

mobile phone
fake call
spam call
  • Loading...

More Telugu News