Atchannaidu: ఎమ్మెల్యే రాచమల్లు ప్రోద్బలంతోనే లోకేశ్ పై కోడిగుడ్ల దాడి జరిగింది: అచ్చెన్నాయుడు

Atchannaidu reacts to egg pelting on Lokesh

  • గతరాత్రి ప్రొద్దుటూరులో లోకేశ్ పాదయాత్ర
  • కోడిగుడ్లు విసిరిన వ్యక్తి
  • దేహశుద్ధి చేసిన టీడీపీ కార్యకర్తలు
  • లోకేశ్ ప్రభంజనం చూసి జగన్ కు చెమటలు పడుతున్నాయన్న అచ్చెన్న
  • అందుకే అల్లరి మూకలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం

కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో గతరాత్రి కోడిగుడ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. లోకేశ్ లక్ష్యంగా విసిరిన కోడిగుడ్లు భద్రతాసిబ్బందిపై పడ్డాయి. ఈ ఘటనతో ఆగ్రహం చెందిన టీడీపీ కార్యకర్తలు గుడ్లు విసిరిన వ్యక్తిని చితకబాదారు. ఈ ఘటనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు స్పందించారు. 

నారా లోకేశ్ పాదయాత్రలో జన ప్రభంజనం చూసి జగన్ కు ఏసీలో ఉన్నా చెమటలు పడుతున్నాయని ఎద్దేవా చేశారు. అందుకే అల్లరి మూకలను రెచ్చగొట్టి పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్ పై కోడిగుడ్ల దాడిని ఖండిస్తున్నట్టు అచ్చెన్నాయుడు తెలిపారు. 

ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. లోకేశ్ పాదయాత్రలో కోడిగుడ్లు విసిరిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Atchannaidu
Nara Lokesh
Egg Pelting
Yuva Galam Padayatra
Proddutur
Rachamallu
TDP
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News