Esic: హైదరాబాద్ ఈఎస్ఐసీలో ఉద్యోగాలు.. నియామక ప్రకటన జారీ

Esic Hyderabad Recruitment 2023 For 76 Posts
  • హైదరాబాద్ లో మొత్తం 76 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
  • ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక
  • ఈ నెల 6 నుంచి 10 వరకు సనత్ నగర్ లో ఇంటర్వ్యూలు
భారత ప్రభుత్వరంగ సంస్థ ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) తాజాగా నియామక ప్రకటన జారీ చేసింది. హైదరాబాద్ సనత్ నగర్ లోని కార్యాలయంలో 76 ఖాళీల భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సూపర్‌ స్పెషలిస్ట్‌లు, సీనియర్‌ రెసిడెంట్ పోస్టుల భ‌ర్తీకి ఈ నెల 6 నుంచి 10 వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి రూ.67,700 నుంచి రూ.2.4 లక్షల వరకు జీతం చెల్లించనున్నట్లు వివరించింది.

జనరల్‌ మెడిసిన్‌, హెమటాలజీ, ఈఎన్‌టీ, ప్లాస్టిక్‌ సర్జరీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, న్యూరాలజీ, కార్డియాలజీ, ఆంకాలజీ, టీబీ/ చెస్ట్‌, బయోకెమిస్ట్రీ త‌దిత‌ర‌ విభాగాల‌లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఈ ప్రకటనలో తెలిపింది. ఆయా పోస్టుల‌ను బ‌ట్టి సంబంధిత స్పెషలైజేషన్‌తో పాటు ఎంబీబీఎస్‌, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత, సంబంధిత పని అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. రూ.500 ఫీజుతో ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. సనత్ నగర్ లోని ఈఎస్ఐసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో మెడికల్ సూపరింటెండెంట్ లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని తెలిపింది. పూర్తి వివరాలకు ఈఎస్ఐసీ వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించింది.
Esic
Hyderabad
Recruitment
notification
76 posts

More Telugu News