Joe Biden: తూలి పడిపోయిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. వీడియో వైరల్.. ట్రంప్ స్పందన ఏమిటంటే..!

US President Joe Biden falls down

  • కొలరాడోలో యూఎస్ ఎయిర్ ఫోర్స్ అకాడెమీలో గ్రాడ్యుయేషన్ వేడుకలు
  • కాలు జారి కింద పడిపోయిన బైడెన్
  • గాయాలు కాలేదని వెల్లడించిన వైట్ హౌస్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కిందపడిపోయారు. కొలరాడోలోని అమెరికా ఎయిర్ ఫోర్స్ అకాడెమీలో నిన్న గ్రాడ్యుయేషన్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో బైడెన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేజిపై ఆయన కాలు జారి తూలి పడ్డారు. వెంటనే అప్రమత్తమైన ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఆయనను పైకి లేపారు. ఆ తర్వాత ఆయన తన సీటు వద్దకు వెళ్లి కూర్చున్నారు. ఈ ఘటనలో బైడెన్ కు ఎలాంటి గాయాలు కాలేదని వైట్ హౌస్ ప్రతినిధి వెల్లడించారు. బైడెన్ కింద పడిపోయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలతో బైడెన్ బాధ పడుతున్నారని పలువురు నెటిజెన్లు వ్యాఖ్యానిస్తున్నారు. 

మరోవైపు బైడెన్ రాజకీయ ప్రత్యర్థి, మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఈ ఘటనపై స్పందించారు. బైడెన్ నిజంగానే పడిపోయారా? అని ప్రశ్నించారు. ఆయనకు గాయాలు కాలేదు కదా? అని అడిగారు.


Joe Biden
USA
Fell down

More Telugu News