Narsapur: నర్సాపూర్-యశ్వంత్‌పూర్ మధ్య ప్రత్యేక రైలు.. ఎల్లుండి నుంచే అందుబాటులోకి

Narsapur Yesavantpur Special Train From 4th June
  • నర్సాపూర్‌లో మధ్యాహ్నం 3.10 గంటలకు బయలుదేరనున్న రైలు
  • తర్వాతి రోజు ఉదయం 10.50 గంటలకు యశ్వంత్‌పూర్ చేరిక
  • తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 3.50కి యశ్వంత్‌పూర్‌లో బయలుదేరనున్న రైలు
నర్సాపూర్-యశ్వంత్‌పూర్ మధ్య ప్రత్యేక రైలును అందుబాటులోకి తెస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఎల్లుండి (4వ తేదీ) నుంచి నడవనున్న ఈ రైలు (07687/07688) మధ్యాహ్నం 3.10 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.50 గంటలకు యశ్వంత్‌పూర్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 5న మధ్యాహ్నం 3.50 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 8.30 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. 

పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట, దొనకొండ, మార్కాపురం, గిద్దలూరు, నంద్యాల, డోన్, అనంతపురం, ధర్మవరం, పెనుగొండ, హిందూపురం స్టేషన్లలో ఈ రైలు ఆగుతుందని అధికారులు తెలిపారు.
Narsapur
Yesvantpur
Indian Railways
Andhra Pradesh

More Telugu News