Vasudev Talegaon Tayade: పీఎంవో నుంచి వచ్చాను... సీక్రెట్ మిషన్ ఆఫీసర్ ను అన్నాడు... దొరికిపోయాడు!

Man pretending as IAS officer arrested by Pune cops

  • ఐఏఎస్ ఆఫీసర్ నంటూ ఓ కార్యక్రమంలో పాల్గొన్న తయాడే
  • పీఎంవో తరఫున పూణే వచ్చానని నమ్మబలికిన వైనం
  • సీనియర్ అధికారులు ప్రశ్నించడంతో జారుకున్న వ్యక్తి
  • ఫోన్ లొకేషన్ ఆధారంగా ఆరెస్ట్  

ఐఏఎస్ ఆఫీసర్ ను అని చెప్పుకుంటున్న ఓ వ్యక్తికి పూణే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరదండాలు వేశారు. అతడి పేరు వాసుదేవ్ నివృతి తయాడే. 54 ఏళ్ల వాసుదేవ్ తాలేగావ్ దభాదే నివాసి. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అతడిని మే 29న పోలీసులు అరెస్ట్ చేశారు. 

తాను ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ నంటూ ఓ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నాడు. తాను ప్రధానమంత్రి కార్యాలయం తరపున ఓ సీక్రెట్ మిషన్ లో పనిచేస్తున్నానని, ఆ పని మీదనే పూణే వచ్చానని అక్కడున్నవారిని నమ్మబలికాడు. తయాడే తన పేరును దాచి డాక్టర్ వినయ్ దేవ్ ఐఏఎస్ అని చెప్పుకున్నాడు. త్వరలోనే డిప్యూటీ సెక్రటరీ హోదా లభించబోతోందని వెల్లడించాడు. 

అతడి తీరుపై అనుమానం వచ్చిన సీనియర్ అధికారులు ప్రశ్నించగా, డొంకతిరుగుడు సమాధానాలు చెప్పి అక్కడ్నించి జారుకున్నాడు. కార్యక్రమ నిర్వాహకుడు తయాడే తీరుపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు అతడిని పట్టుకునేందుకు ఓ బృందాన్ని రంగంలోకి దింపారు. 

చివరికి ఫోన్ లొకేషన్ ఆధారంగా ఆ నకిలీ ఐఏఎస్ ను పట్టుకున్నారు. పీఎంఓ అధికారినని చెప్పుకుంటూ అతడు ఏమైనా నేరాలకు పాల్పడ్డాడేమోనన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Vasudev Talegaon Tayade
Pune
PMO
Secret Mission
  • Loading...

More Telugu News