Alia Bhatt: అలియా భట్ ఇంట్లో విషాదం

alia bhatt grandfather narendra razdan passes away at 93
  • అలియా తాతయ్య నరేంద్ర రజ్దాన్‌ కన్నుమూత
  • చివరి క్షణం దాకా ఆయన తన జీవితాన్ని ప్రేమించారన్న ఆలియా
  • ఆయన లేరన్న బాధతో మనసంతా దుఃఖంతో నిండిపోయిందని భావోద్వేగం
బాలీవుడ్‌ హీరోయిన్‌ అలియా భట్‌ ఇంట విషాదం నెలకొంది. ఆమె తాతయ్య నరేంద్ర రజ్దాన్‌ (93) గురువారం కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో వెల్లడిస్తూ అలియా భట్‌ భావోద్వేగానికి లోనైంది.

‘‘మా తాతయ్య.. నా హీరో. 93 ఏళ్ల వయసులో కూడా గోల్ఫ్‌ ఆడారు. ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు. నాకోసం ఆమ్లెట్‌ వేసిచ్చేవారు. బోలెడన్ని కథలు చెప్పేవారు. వయోలిన్‌ వాయించేవారు. తన ముని మనవరాలితో కూడా ఆటలాడుకున్నారు. ఆయన క్రికెట్‌, స్కెచింగ్, కుటుంబాన్ని ఎంతో ప్రేమించారు. చివరి క్షణం దాకా తన జీవితాన్ని తాను ప్రేమించారు’’ అని అలియా రాసుకొచ్చింది.

‘‘ఇప్పుడు మీరు లేరన్న బాధతో నా మనసంతా దుఃఖంతో నిండిపోయింది. అదే సమయంలో ఆనందంగానూ ఉంది. ఎందుకంటే మా తాతయ్య నాకు బోలెడంత సంతోషాన్ని అందించారు. అందుకు చాలా గర్వంగా ఉంది. మనం మళ్లీ కలుసుకునేవరకు దాన్ని అలాగే భద్రంగా ఉంచుకుంటాను’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టింది. ఇటీవల జరిగిన నరేంద్ర పుట్టిన రోజు వేడుకల వీడియోను జత చేసింది.
Alia Bhatt
grand father
narendra razdan
Instagram

More Telugu News