Sujana Chowdary: బీజేపీ పెద్దలతో పవన్ కల్యాణ్ చర్చలు జరిపారు: సుజనా చౌదరి

Pawan Kalyan meet BJP top leaders for alliance in AP

  • వచ్చే ఎన్నికల్లో పొత్తుతోనే ముందుకు సాగుతాయని ఆశాభావం
  • ఈశాన్య రాష్ట్రాలతో పోలిస్తే ఏపీకి కేంద్రం ఎక్కువ సాయం చేసిందని వ్యాఖ్య
  • మోదీ నిధులు ఇచ్చినా మూడు రాజధానుల పేరుతో జగన్ అభివృద్ధి నిలిపేశారని ఆగ్రహం

పొత్తులకు సంబంధించి తమ పార్టీ అధిష్ఠానంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చర్చలు జరిపారని బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి తెలిపారు. ఈ రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో పొత్తుతోనే ముందుకు సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అధిష్ఠానం ఏం చెబితే దానిని మేం అనుసరిస్తామని వెల్లడించారు. ఈశాన్య రాష్ట్రాలతో పోలిస్తే కేంద్రం ఆంధ్ర ప్రదేశ్ కే ఎక్కువ సాయం చేసిందన్నారు. ఈ విషయమై ఎవరు చర్చకు వచ్చినా తాము సిద్ధమని సవాల్ చేశారు. రాజధాని కోసం ప్రధాని నరేంద్ర మోదీ నిధులు ఇచ్చినా మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రగతిని ఆపేశారన్నారు.

ఏపీ విభజన చట్టంలోని అనేక అంశాలను మోదీ అమలు చేశారని, రాష్ట్రానికి నిమ్స్, విద్యా సంస్థలు, జాతీయ రహదారులు ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో అసమర్థ పాలన వల్ల ఏపీలో పూర్తిస్థాయి అభివృద్ధి జరగలేదన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం స్థలం కూడా ఇవ్వలేదన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. అమరావతిని అభివృద్ధి చేయకుండా ముఖ్యమంత్రి జగన్ నాశనం చేశారన్నారు.

Sujana Chowdary
Pawan Kalyan
YS Jagan
Janasena
  • Loading...

More Telugu News