Bellamkonda Srinivas: హరీశ్ శంకర్ క్లాప్ తో రంగంలోకి దిగిన బెల్లంకొండ శ్రీనివాస్!

- నిరాశపరిచిన 'ఛత్రపతి' రీమేక్ ఫలితం
- బెల్లంకొండ శ్రీనివాస్ కి పెరిగిన గ్యాప్
- సాగర్ కె చంద్ర దర్శకత్వంలో కొత్త సినిమా
- ఈ రోజునే పట్టాలెక్కిన ప్రాజెక్టు
బెల్లంకొండ శ్రీనివాస్ 'ఛత్రపతి' రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డాడు. అయితే ఆ సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఆ సినిమాపైనే పూర్తి ఫోకస్ పెట్టడం వలన .. ఆ ప్రాజెక్టు ఎక్కువ కాలం పాటు సెట్స్ పై ఉండటం వలన ఆయనకి ఇక్కడ గ్యాప్ వచ్చేసింది.

