Balakrishna: 'బిగ్ బాస్ 7' కోసం ఈ సారి ఇలా ప్లాన్ చేశారట!

Bigg Boss 7 news update

  • 'బిగ్ బాస్ 7' కోసం కసరత్తు 
  • ఆదరణ తగ్గుతూ రావడంతో ఆలోచనలో పడిన టీమ్
  • ఆసక్తిని పెంచే దిశగా చేస్తున్న మార్పులు 
  • ఈ సారి హోస్టుగా తెరపైకి బాలయ్య పేరు  

తెలుగులో బిగ్ బాస్ ఇంతవరకూ 6 సీజన్లను పూర్తిచేసుకుంది. ఎన్టీఆర్ .. నాని .. నాగార్జున హోస్టులుగా వ్యవహరిస్తూ వచ్చారు. చివరి నాలుగు ఎపిసోడ్స్ కి హోస్ట్ గా నాగార్జున ఉన్నారు. అయితే మొదటి 4 సీజన్ల తరువాత ఈ రియాలిటీ షోపై జనంలో ఆదరణ తగ్గుతూ వచ్చింది. రేటింగ్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది.

జనాలకు పెద్దగా తెలియనివారిని పోటీదారులుగా తీసుకోవడం .. టాస్కులను ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేయకపోవడం .. నామినేషన్స్ లో పస లేకపోవడం .. జనాల అంచనాలకు దూరంగా ఎలిమినేషన్స్  జరగడం .. ఎవరు ఎలిమినేట్ అవుతున్నదీ ముందుగానే లీక్ కావడం వంటివి ఈ షో పట్ల ఆదరణ తగ్గడానికి కారణమని నిర్వాహకులు భావించారట. 

అందువల్లనే అలాంటివేం జరగకుండా ఈ సారి 'బిగ్ బాస్ 7' ఉండేలా కసరత్తు చేస్తున్నారని సమాచారం. వివాదాస్పదమైన వ్యక్తులను పోటీదారులుగా తీసుకోవడం .. విడాకులు తీసుకున్న పాప్యులర్ జంటను ఎంపిక చేయడం .. టాస్కులు ఉత్కంఠ భరితంగా ఉండేలా చూడటం ప్రధానంగా డిజైన్ చేస్తున్నారని అంటున్నారు. ఇంతవరకూ అయితే ఈ షోకి హోస్టుగా బాలకృష్ణ పేరు వినిపిస్తోంది. 

Balakrishna
Big Boss 7
  • Loading...

More Telugu News