Ashok Gehlot: మరో పెద్ద ఎన్నికల హామీని ఇచ్చిన రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్

Big election promise from Ashok Gehlot

  • ఈ ఏడాది చివర్లో రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు
  • 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని గెహ్లాట్ హామీ
  • మరో 100 యూనిట్ల కరెంట్ ఫిక్సెడ్ రేటుకు ఇస్తామని వాగ్దానం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం దక్కడంతో కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్ లో ఉంది. ఈ ఏడారి చివరి కల్లా మరిన్ని రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో రాజస్థాన్ ఒకటి. రాజస్థాన్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రజాకర్షక హామీలను గుప్పిస్తున్నారు. రూ. 500 చెప్పున ఏడాదికి 12 వంట గ్యాస్ సిలిండర్లను ఇస్తామని ఇప్పటికే హామీ ఇచ్చిన ఆయన... ఇప్పుడు మరో భారీ హామీని ఇచ్చారు. 100 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని... మరో 100 యూనిట్లను ఫిక్సెడ్ రేటుకు ఇస్తామని చెప్పారు.

Ashok Gehlot
Rajasthan
Congress
  • Loading...

More Telugu News