Abhiram: రేపు థియేటర్లకు వస్తున్న సినిమాలివే .. సందడి గట్టిగానే ఉందే!

New Movies Update

  • రేపు థియేటర్లకు వస్తున్న 'అహింస'
  • అదే రోజున రిలీజ్ అవుతున్న 'నేను స్టూడెంట్ సర్'
  •  లైన్లో అజయ్ 'చక్రవ్యూహం' .. తిరువీర్ 'పరేషాన్'
  • ఏది ఎక్కువ మార్కులు కొట్టేస్తుందనే దానిపై ఆసక్తి

ఈ శుక్రవారం థియేటర్ల దగ్గర కాస్త గట్టిగానే సందడి కనిపించబోతోంది. తెలుగు నుంచి నేరుగా నాలుగు సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. ఈ నాలుగు సినిమాలు కూడా డిఫరెంట్ జోనర్స్ కి చెందినవి కావడం విశేషం. అందరూ కూడా తమదైన స్టైల్లో ప్రమోషన్స్ చేస్తూ, జనాలను థియేటర్స్ దిశగా నడిపించడానికి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ నాలుగు సినిమాలలో 'అహింస' ఒకటిగా కనిపిస్తోంది. ఆనంది ఆర్ట్స్ - సురేశ్ ప్రొడక్షన్స్ వారు కలిసి నిర్మించిన సినిమా ఇది. ఇది తేజ సినిమా కావడం .. దీనితోనే అభిరామ్ హీరోగా పరిచయమవుతుండటం .. ఆర్ఫీ పట్నాయక్ రీ ఎంట్రీ ఇస్తుండటంతో సహజంగానే అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. రేపు రిలీజ్ అవుతున్న సినిమాల్లో ఇది ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఇక బెల్లంకొండ గణేశ్ మూవీ 'నేను స్టూడెంట్ సర్' కూడా రేపు బరిలోకి దిగుతోంది. రాఖి ఉప్పలపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాతో, భాగ్యశ్రీ కూతురు అవంతిక హీరోయిన్ గా పరిచయమవుతోంది. తిరువీర్ 'పరేషాన్' .. అజయ్ 'చక్రవ్యూహం' కూడా రేపు విడుదలవుతున్నాయి. ఈ నాలుగు సినిమాల్లో వసూళ్ల పరంగా ఏది ముందంజలో ఉంటుందో చూడాలి మరి.

Abhiram
Bellamkonda Ganesh
Ajay
Thiruveer
  • Loading...

More Telugu News