: అక్కడ పెళ్లికాకుండా తల్లి ఐతే జరిమానా!


మనదేశంలో పెళ్లికాకుండానే తల్లి అయితే సమాజంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి. కానీ అక్కడ మాత్రం పెళ్లికాకుండా తల్లి అయితే మాత్రం పెద్ద మొత్తంలో జరిమానా చెల్లించేస్తే సరిపోతుంది. ఈ మేరకు అక్కడ నూతన ప్రతిపాదనలు రూపొందుతున్నాయి. చైనాలోని వుహాన్‌ సిటీలో ఈ మేరకు ప్రతిపాదనతో కూడిన ముసాయిదా సిద్ధమయింది. అయితే ఈ ప్రతిపాదన పట్ల అక్కడ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ కొత్త ప్రతిపాదన వల్ల గర్భస్రావాలు, పుట్టగానే బిడ్డలను వదిలేయడాలు వంటి సంఘటనలు మరింతగా పెరుగుతాయని ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ తాజా ముసాయిదా ప్రకారం పెళ్లికాకుండా తల్లులైన వారికి, తమ బిడ్డకు తండ్రి ఎవరో చెప్పలేని వారికి, ఒక పురుషుడికి వివాహమై భార్య ఉందని తెలిసి కూడా అతడి ద్వారా పిల్లలు కన్నవారికి పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తారని చైనా డెయిలీ తెలిపింది. ఈ నిబంధన కింద సదరు పెళ్లి కాని తల్లులు తమ గత ఏడాది సగటు ఆదాయానికి కనీసం రెండు రెట్లు సొమ్మును సామాజిక పరిహారం ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. దీని వల్ల కుటుంబ నియంత్రణను మరింత సమర్ధవంతంగా అమలు చేయడంతోబాటు దేశంలో జననాల రేటును కూడా తక్కువ స్థాయిలో ఉంచేందుకు దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే దీనిపై అభ్యంతరాలను, సలహాలను కోరుతూ సదరు ముసాయిదాను అధికారులు ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. ఈనెల 7వ తేదీ వరకూ దీనిపై వచ్చిన అభ్యంతరాలను, సలహాలను స్వీకరిస్తారు.

  • Loading...

More Telugu News