Nara Lokesh: పాదయాత్రలో నారా లోకేశ్ ఎలాంటి ఆహారం తీసుకుంటారో తెలుసా...!
- యువగళం పాదయాత్ర చేస్తున్న లోకేశ్
- జనవరి 27న కుప్పంలో ప్రారంభం
- 400 రోజుల పాటు 4000 కిలోమీటర్ల మేర పాదయాత్ర
- ఇటీవలే 100 రోజులు పూర్తి
- ఆరోగ్యానికి, ఫిట్ నెస్ కు ప్రాధాన్యత ఇస్తున్న లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ భారీ స్థాయిలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. లోకేశ్ పాదయాత్ర పేరు యువగళం. 400 రోజుల పాటు 4000 కిలోమీటర్ల మేర లోకేశ్ ఏపీ వ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నారు. జనవరి 27న లోకేశ్ పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభమైంది. ఇటీవల ఆయన పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకుంది.
మండే ఎండాకాలం అయినప్పటికీ లోకేశ్ తరగని ఉత్సాహంతో కాలినడకన ఒక్కొక్క నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. ఎంతో సుదీర్ఘమైన పాదయాత్ర కావడంతో ఫిట్ నెస్ కు, ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగానే లోకేశ్ ఆహారపు అలవాట్లను ప్లాన్ చేశారు.
పాదయాత్రలో లోకేశ్ దిన చర్య ఎలా ఉంటుందంటే... ఆయన ఉదయం 6 గంటలకు నిద్ర లేస్తారు. కాలకృత్యాలు తీర్చుకుని 6.30 గంటలకు కాఫీ తాగుతారు. ఉదయం 7 గంటలకు దినపత్రికలు చదువుతారు, తన పబ్లిక్ రిలేషన్స్ బృందం నుంచి వివరాలు తెలుసుకుంటారు.
7.30 గంటల నుంచి అరగంట సేపు వ్యాయామం చేస్తారు. 8.15 గంటలకు స్నానం చేసి ఫ్రెషప్ అవుతారు. ఉదయం 8.15-8.30 మధ్య బ్రేక్ ఫాస్ట్ చేస్తారు.
ఉదయం 8.30-9.30 మధ్య పాదయాత్ర ప్రారంభిస్తారు. 9.30 గంటలకు పాదయాత్ర ప్రారంభం అయ్యాక ఒక లీటర్ నీరు తాగుతారు. మధ్యాహ్నం 12 గంటలకు కొబ్బరినీళ్లు తాగుతారు.
మధ్యాహ్నం 1.00-1.30 గంటలకు భోజనం చేస్తారు. మధ్యాహ్న భోజనంలో క్వినోవా రైస్, కూరగాయలతో చేసిన వంటకాలు తీసుకుంటారు. భోజనం అనంతరం అల్లం టీ తాగుతారు.
ఇక, సాయంత్రం 4 గంటలకు లీటర్ మంచినీరు తాగుతారు. 5.00 గంటలకు కొబ్బరినీళ్లు తాగుతారు. రాత్రి 7 గంటలకు పాదయాత్ర ముగించకుని విడిది కేంద్రానికి చేరుకుంటారు. రాత్రి 8.00-8.15 గంటలకు రాత్రి భోజనం చేస్తారు. రాత్రి భోజనంలో తేలికగా అరిగే ఆహార పదార్థాలు తీసుకుంటారు.
వేసవి తీవ్రత దృష్ట్యా లోకేశ్ ఇటీవల సాయంత్రం వేళల్లో పాదయాత్ర చేస్తున్నారు.