Nallari Kiran Kumar Reddy: ఇప్పుడున్న ప్రభుత్వంపై సమయం వచ్చినప్పుడు మాట్లాడతా: కిరణ్ కుమార్ రెడ్డి

Kiran Kumar Reddy talks about AP politics

  • కొన్ని నెలల కిందట బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి
  • ఓ నెల పాటు అమెరికాలో ఉండి వచ్చానని వెల్లడించిన కిరణ్
  • ఏపీలో బీజేపీ బలోపేతం కోసం కృషి చేస్తానని వ్యాఖ్యలు
  • ఏపీలో పరిస్థితులపై మాట్లాడాలంటే గంటలకొద్దీ సమయం పడుతుందన్న మాజీ సీఎం   

ఇటీవలే బీజేపీలో చేరిన సీనియర్ రాజకీయవేత్త, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే అమెరికా వెళ్లి ఒక నెలరోజులు ఉండి వచ్చానని తెలిపారు. 

అనంతరం, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుతో ఏపీ రాజకీయ పరిస్థితులపై చర్చించానని, రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కోసం తనకున్న అనుభవాన్ని వినియోగిస్తానని ఆయనకు చెప్పానని వెల్లడించారు. ఏపీలో బీజేపీ స్థానం ఏమిటి, పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఏమేం చేయాలి అనేదానిపై సోము వీర్రాజుతో మాట్లాడానని తెలిపారు. 

ఇక ఏపీలో ప్రస్తుత పాలనపై స్పందించాలని ఓ మీడియా ప్రతినిధి కిరణ్ కుమార్ రెడ్డిని అడిగారు. అందుకు కిరణ్ కుమార్ రెడ్డి బదులిస్తూ... ఏపీలో ప్రస్తుత పరిస్థితుల గురించి ఇలా రోడ్డుపై నిల్చుని మాట్లాడలేమని అన్నారు. అది గంటల తరబడి మాట్లాడాల్సిన అంశం అని తెలిపారు. ఇప్పుడున్న ప్రభుత్వంపై సమయం వచ్చినప్పుడు మాట్లాడతానని స్పష్టం చేశారు.

More Telugu News