Naresh: పవిత్ర లోకేశ్ తో కలిసి సూపర్ స్టార్ కృష్ణకు విందు ఇచ్చినప్పటి ఫొటోలు పంచుకున్న నరేశ్

Naresh tweets on Superstar Krishna Birth anniversary

  • నేడు సూపర్ స్టార్ కృష్ణ జయంతి
  • కృష్ణను స్మరించుకుంటూ నరేశ్ ట్వీట్
  • సూపర్ స్టార్ ఆశీస్సులు తనకెప్పుడూ ఉంటాయని వెల్లడి

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్, దక్షిణాది నటి పవిత్ర లోకేశ్ ల మధ్య ఉన్న అనుబంధం గురించి తెలిసిందే. ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ జయంతి. ఈ సందర్భంగా నరేశ్ సోషల్ మీడియాలో ఆసక్తికర ఫొటోలు పంచుకున్నారు. పవిత్ర లోకేశ్ తో కలిసి కృష్ణకు విందు ఇచ్చిన దృశ్యాలు ఆ ఫొటోల్లో ఉన్నాయి. తిరుగులేని, మహోన్నత సూపర్ స్టార్ కృష్ణ గారిని ఆయన జయంతి సందర్భంగా స్మరించుకుంటున్నట్టు నరేశ్ తెలిపారు. భారతీయ సినిమా రంగానికి ఆయన అందించిన సేవలు, ఆయన ఘనతర వారసత్వం తరతరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని వివరించారు. సూపర్ స్టార్ కృష్ణ ఆశీస్సులు తనకెప్పుడూ ఉంటాయని నరేశ్  పేర్కొన్నారు.

More Telugu News