Abhiram: నా వల్లనే అభిరామ్ కాలు విరగ్గొట్టుకున్నాడు: డైరెక్టర్ తేజ

Ahimsa movie update

  • అభిరామ్ హీరోగా రూపొందిన 'అహింస'
  • ప్రేమకథా నేపథ్యంలో సాగే సినిమా 
  • జూన్ 2వ తేదీన సినిమా విడుదల 
  • అభిరామ్ చాలా కష్టపడ్డాడన్న తేజ 

తేజ తన కెరియర్లో ఇంతవరకూ ప్రేమకథలనే ఎక్కువగా చేస్తూ వచ్చాడు. ఆ లవ్ స్టోరీస్ ద్వారా కొంతమంది హీరోలను పరిచయం చేశాడు. అలాగే దగ్గుబాటి అభిరామ్ హీరోగా 'అహింస' సినిమాను రూపొందించాడు. జూన్ 2వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ వేగాన్ని పెంచారు.

ఈ సినిమా ప్రమోషన్స్ లో తేజ మాట్లాడుతూ .. "రామానాయుడు స్టూడియో చుట్టూ ప్రతి రోజు సైకిల్ తొక్కమని నేను అభిరామ్ తో చెప్పాను. అలా చేయడానికి తను చాలా కష్టపడ్డాడు. ఈ సినిమాలో హీరోయిన్ ను ఒక భుజంపై వేసుకుని, మరో భుజానికి తుపాకులు తగిలించుకుని పరిగెత్తాలి. ఆ సమయంలోనే అతను పడిపోయాడు" అని చెప్పాడు. 

"అలా షూటింగులో అతను పడిపోవడం వలన కాలు విరిగింది. దాంతో నాలుగు నెలల పాటు హాస్పిటల్లో ఉండవలసి వచ్చింది. నిజానికి తనకి గల ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కి ఇంత చేయవలసిన అవసరం లేదు. కానీ కష్టపడాల్సిందే అనే ఉద్దేశంతో ఎంతో అంకిత భావంతో పనిచేశాడు. పాపం ఆయనకి కూడా నా టార్చర్ తప్పలేదు " అంటూ చెప్పుకొచ్చాడు.

Abhiram
Geethika
Teja
Ahimsa Movie
  • Loading...

More Telugu News