Vijayashanti: ఈటల చేతులెత్తేశారన్న హరీశ్ రావు వ్యాఖ్యలపై విజయశాంతి ఫైర్

Vijayashanthi fires on Harish Rao

  • బీజేపీలో ఎవరూ చేరడం లేదన్న హరీశ్
  • బీజేపీని గెలిపించేది కార్యకర్తలు, ప్రజల విశ్వాసాలన్న విజయశాంతి
  • హరీశ్ చేస్తున్న విమర్శల ప్రచారం ఎన్నటికీ నిలవదని వ్యాఖ్య

బీజేపీలో ఎవరూ చేరడం లేదని, ఆ పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ చేతులెత్తేశారని బీఆర్ఎస్ నేత, మంత్రి హరీశ్ రావు నిన్న వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హరీశ్ రావుపై బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శలు గుప్పించారు. ఇక చేరకలు లేవంటూ చిట్ చాట్ లో ఈటల చెప్పారని హరీశ్ రావు అంటున్నారని... బీజేపీని నిరంతరం గెలిపిస్తున్నది ప్రాణమిచ్చే కార్యకర్తల త్యాగాలు, బీజేపీ నమ్మే ప్రజల విశ్వాసాలు, రక్తమిచ్చే హైందవ ధర్మశ్రేణుల పోరాటాలు మాత్రమేనని ఆమె అన్నారు. చేరికల కమిటీ పేరు చెపుతూ, చిట్ చాట్ లను ప్రస్తావిస్తూ మీరు చేస్తున్న బీజేపీ వ్యతిరేక విమర్శల ప్రచారం ఎన్నటికీ నిలవదని అన్నారు. ఈ విషయం హరీశ్ రావు గారికి తెలవంది కాదని ఎద్దేవా చేశారు.

Vijayashanti
Etela Rajender
BJP
Harish Rao
BRS
  • Loading...

More Telugu News