Rakshith Atluri: భయం గుప్పెట్లో జనం .. 'ఆపరేషన్ రావణ్' నుంచి ఫస్టు థ్రిల్!

Operation Ravan First Thrill

  • రక్షిత్ హీరోగా 'ఆపరేషన్ రావణ్'
  • సీరియల్ కిల్లర్ నేపథ్యంలో నడిచే కథ 
  • కీలకమైన పాత్రను పోషించిన రాధిక 
  • ఆసక్తిని పెంచుతూ వెళుతున్న అప్ డేట్స్

గతంలో వచ్చిన 'పలాస 1978' సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత అదే నిర్మాతలు 'ఆపరేషన్ రావణ్' ప్రాజెక్టును పట్టాలెక్కించారు. ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో .. వెంకటసత్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నుంచి, ఫస్టు థ్రిల్ పేరుతో ఒక స్పెషల్ వీడియోను వదిలారు. మ్యూజిక్ లెంగ్త్ లో ఇంట్రెస్టింగ్ విజువల్స్ పై ఈ వీడియోను కట్ చేశారు.

రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన ఈ సినిమా నుంచి వచ్చిన వీడియోను బట్టి చూస్తే, ఇది ఒక సైకో థ్రిల్లర్ గా .. సీరియల్ కిల్లర్ నేపథ్యంలో నడిచే సస్పెన్స్ థ్రిల్లర్ గా అనిపిస్తోంది. హంతకుడు ఒక చిత్రమైన మాస్కు ధరించి, అత్యంత భయంకరంగా హత్యలు చేస్తూ వెళుతుంటాడు. అతణ్ణి పట్టుకోవడానికి పోలీసులు ట్రై చేస్తుంటారు. 

హంతకుడు ఎవరు? ఎందుకు ఇలా హత్యలు చేస్తున్నాడు? అనేది సస్పెన్స్. హీరో లైఫ్ ను కిల్లర్ ఏ వైపు నుంచి టచ్ చేశాడు? రంగంలోకి దిగిన హీరో ఏం చేశాడు? అనేవి ఆసక్తికర అంశాలు. ఇక కథలో క్షుద్రవిద్యలకి సంబంధించిన కోణం కూడా కనిపిస్తోంది. రాధిక కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Rakshith Atluri
Radhika
Venkata Sathya
Operation Ravan

More Telugu News