Bellamkonda Ganesh: రెండో సినిమాకే యాక్షన్ లోకి దిగిపోయిన యంగ్ హీరో!

Bellamkonda Ganesh Special

  • 'స్వాతిముత్యం'తో ఎంట్రీ ఇచ్చిన గణేశ్ 
  • రెండో సినిమాగా 'నేను స్టూడెంట్ సర్'
  • జూన్ 2వ తేదీన సినిమా విడుదల
  • ఈ సారి యాక్షన్ హీరోగాను మార్కులు కొట్టేసే ప్రయత్నం 

ఒకప్పుడు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన హీరోలు కొంతకాలం పాటు వరుసగా లవ్ స్టోరీస్ చేస్తూ వెళ్లేవారు. చాలా కాలం తరువాత యాక్షన్ సినిమాల వైపు వెళ్లేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించడానికీ .. కొత్త జోనర్లలో చేయడానికి యంగ్ హీరోలు ఉత్సాహాన్ని చూపుతున్నారు. 

ఇప్పుడు బెల్లంకొండ గణేశ్ కూడా అదే పద్ధతిని ఫాలో అవుతున్నాడు. తన తొలి సినిమా అయిన 'స్వాతిముత్యం'లో ఆయన చాలా సాఫ్ట్ రోల్ చేశాడు. తనకి ఎదురైన సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక ఆ సినిమాలో నానా తంటాలు పడతాడు. చూడగానే కాస్త సాఫ్ట్ గా కనిపించే గణేశ్ ను ఆ రోల్ లో ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నారు. 

కానీ ఆయన తన తాజా చిత్రమైన 'నేను స్టూడెంట్ సర్' సినిమాలో యాక్షన్ సీన్స్  ను ఒక రేంజ్ లో చేశాడనే విషయం పోస్టర్స్ చూస్తుంటేనే అర్థమైపోతోంది. రెండో సినిమాకే భారీ ఫైట్లు గట్రా చేసేశాడు. ఆయన చేసిన ఫస్టు మూవీ సరైన సమయంలో రిలీజ్ కాలేదనే కామెంట్లు వినిపించాయి. మరి సరైన ప్లానింగుతో జూన్ 2న వస్తున్న ఈ సినిమాతో ఈ యంగ్ హీరో హిట్ కొడతాడేమో చూడాలి. 

Bellamkonda Ganesh
Avanthika
Nenu Student Sir
Movie
  • Loading...

More Telugu News